పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సాలార్ అంతర్జాతీయ మార్కెట్లో భారీ వసూళ్లను సాధించింది. ఉత్తర అమెరికాలోని ప్రీమియర్ల నుండి ఈ చిత్రం 2.5 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. మొత్తం ఓవర్సీస్ నుండి ఈ యాక్షన్ డ్రామా మొదటి రోజు (ప్రీమియర్స్‌తో సహా) 6 మిలియన్ డాలర్ల భారీ ఓపెనింగ్ సాధించింది. ఇది భారతీయ కరెన్సీలో దాదాపు 50 కోట్లు ఉంటుంది. సాలార్‌తో పోలిస్తే, ఓవర్సీస్లో 2.8 మిలియన్ డాలర్ల రేంజ్లో డుంకీ తక్కువ ఓపెనింగ్‌ను సాధించింది.
తాజాగా ఇప్పుడు, షారూఖ్ ఖాన్ చిత్రం ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లలో సాలార్‌ను డామినేట్ చేయడం ప్రారంభించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్‌లలో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం కంటే డుంకి ముందుంది. ఉత్తర అమెరికాలో డుంకీ టిక్కెట్ ధరలు చాలా తక్కువగా ఉంది. ఇప్పటి వరకు, సాలార్ మరియు డుంకి ఓవర్సీస్ నుండి 8 మిలియన్ డాలర్ల రేంజ్లో వసూలు చేశాయి.