ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో టూర్ కి తమన్నా,విజయ్ వర్మ ప్లాన్

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 27, 2023, 01:49 PM

తమన్నా పీకల్లోతు ప్రేమలో ఉంది. నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్నట్లు వెల్లడించిన అమ్మడు.... అతనితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతుంది. తాజాగా మరో టూర్ కి ప్లాన్ చేశారు. నటుడు విజయ్ వర్మ హీరోయిన్ తమన్నా భాటియా మధ్య ఎఫైర్ నడుస్తుందని ఈ ఏడాది ప్రారంభంలో వార్తలు వచ్చాయి. ఈ పుకార్లను తమన్నా ఖండించారు. నేను ఎవరినీ ప్రేమించడం లేదని చెప్పింది. అయితే తరచుగా వీరు కలవడం, కెమెరా కంటికి చిక్కడం పరిపాటి అయ్యింది. కొన్నాళ్ళు సీక్రెట్ మైంటైన్ చేసిన తమన్నా-విజయ్ వర్మ ఓపెన్ అయ్యారు. అవును మేమిద్దరం ఇష్టపడ్డాం అని చెప్పారు. మరి ప్రేమ ఎప్పుడు మొదలైంది? ఎలా ఒక్కటయ్యారని? అడిగ్గా... ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 


 లస్ట్ స్టోరీస్ 2లో విజయ్ వర్మ, తమన్నా కలిసి నటించారు. ఇద్దరి మధ్య బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి. ఆ సిరీస్ షూటింగ్ లోనే మనసులు కలిశాయట. విజయ్ వర్మ నాకు రక్షణగా ఉంటాడు. నన్ను కాపాడతాడు అనే నమ్మకం కలిగింది. అందుకే ప్రేమించానని తమన్నా చెప్పుకొచ్చింది. తమ రిలేషన్ పై ఓపెన్ అయ్యాక జంటగా విహరిస్తున్నారు. ఖాళీ దొరికితే చాలు ఏకాంతంగా ఎక్కడికైనా వెళ్లిపోతున్నారు. తాజాగా మరో టూర్ ప్లాన్ చేశారు. ఇద్దరూ వేరు వేరు కార్లలో ముంబై ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. మీడియా వాళ్ళను చుట్టుముట్టడంతో అసలు మేటర్ బయటకు వచ్చింది. కాగా పెళ్లికి ముందే కలిసి జీవించడం, ఇష్టమైన ప్రదేశాల్లో విహరించడం కామన్ అయిపోయింది. బాలీవుడ్ లో ఈ కల్చర్ మరీ ఎక్కువైంది. శృతి హాసన్ ఒకరితో సహజీవనం చేస్తుంది. అలియా భట్ తల్లి అయ్యాక రన్బీర్ కపూర్ ని పెళ్లి చేసుకుంది. వచ్చే ఏడాది తమన్నా-విజయ్ వర్మ పెళ్లి పీటలు ఎక్కే అవకాశం కలదు. తమన్నా స్టార్ హీరోయిన్ హోదా కోల్పోయింది. అయితే పెద్ద ప్రాజెక్ట్స్ వస్తూనే ఉన్నాయి. ఏడాది భోళా శంకర్, జైలర్ చిత్రాల్లో ఆమె నటించింది. బాలయ్య-బాబీ మూవీలో తమన్నా హీరోయిన్ అని ప్రచారం జరుగుతుంది. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com