రవి కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ఒక చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'అయాలాన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. చాలా అంచనాలు ఉన్న ఈ తమిళ సైన్స్ ఫిక్షన్ చిత్రం జనవరి 12, 2024న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ మహిళా ప్రధాన పాత్రలో నటించారు.
ఇటీవలి ఇంటర్వ్యూలో, శివకార్తికేయన్ చిత్ర బృందం దృష్టిని ప్రేక్షకులకు తీసుకురావాలనే అయాలాన్ కోసం ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోకూడదని ఎంచుకున్నట్లు వెల్లడించాడు. అలాగే, గ్రహాంతరవాసి పాత్ర కు వాయిస్ ఓవర్ అందించిన సిద్ధార్థ్ కూడా డబ్బింగ్ కి రెమ్యునరేషన్తీసుకోలేదు అని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
ఈ సినిమాలో శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్, భాను ప్రియ మరియు యోగి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 24 AM స్టూడియోస్ మరియు ఫాంటమ్ఎఫ్ఎక్స్ స్టూడియోస్ బ్యానర్లపై కోటపాడి జె రాజేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి లెజెండరీ ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు.