ఇలా బిగ్ బస్ నుంచి వచ్చిందోలేదో.. అలా లక్కీ ఛాన్స్ కొట్టేసింది కార్తీక దీపం విలన్ మోనితా.. అలియాస్ శోభా శెట్టి. వచ్చీ రాగానే కొన్ని రోజులకు అవార్డ్ సాధించి సత్తా చాటింది. మోనితా అలియాస్ శోభాశెట్టి. ‘కార్తీక దీపం’ సీరియల్ తో ఎంత ఫేమస్ అయ్యిందో.. బిగ్ బాస్ తో ఇంకా ఫేమస్ అయ్యింది. అచ్చంగా కార్తీక దీపం మోనితలాగే ప్రవర్తించి కాస్త నెగెటివిటీని మూటగట్టుకుంది శోభాశెట్టి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో శోభ శెట్టి చూపించిన సినిమాలు గొడవలు, అన్నీ ఇన్ని కావు. ఇక శోభ బిగ్ బాస్ ఫైనల్స్ కు వారం ముందు ఎలిమినేట్ అయ్యింది. చివరి వరకూ ఉండి.. కంటెస్టెంట్ గా తన సత్తా ఏంటో చూపించింది. అయితే ఇలా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిందో లేదో..అలా అరుదైన గౌరవాన్ని పొందింది శోభా శెట్టి. శోభా శెట్టిని రాష్ట్రీయ గౌరవ్ అవార్డు వరించింది. అవార్డు వచ్చిన సంబరాన్ని శోభా శెట్టి తన సోషల్ మీడియా ఫేజ్ లో చెప్పుకుని దిల్ ఖుష్ అయ్యింది. ఇన్ స్టాగ్రామ్‌లో దానికి సబంధించిన ఫోటోలను శేర్ చేసుకుంది. కార్తీక దీపం సీరియల్ ఎంతటి ప్రజాదరణ పొందిందో తెలిసిందే. ఈ సీరియల్‌లో విలన్ పాత్రలో నటించిన శోభా శెట్టికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఇక లేడీ విలన్‌గా శోభా శెట్టికి తిరుగులేని ఇమేజ్ వచ్చింది. అందంలో హీరోయిన్లకు పోటీ ఇవ్వగల శోభ.. నెగెటీవ్ క్యారెక్టర్స్ లో.. హావభావాలతో అదరగొట్టింది. అయితే ఈమె 5 వారాలకే హౌస్ నుండి వెళ్లిపోతుందని అంతా ఎక్స్‌పెక్ట్ చేసారు. కాని గట్టిగా నిలబడి.. అందరి అంచనాలను తారుమారు చేసి. శోభా శెట్టి 14 వారాలు బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగారు. టాప్ 7 కంటెస్టెంట్‌గా నిలిచింది. ఈ భామ బిగ్ బాస్ సీజన్ పూర్తై బయటకు వచ్చారో లేదో రాష్ట్రీయ గౌరవ్ అవార్డు వరించింది.అయితే ఈ అవార్డ్ కూడా ఆహెకు కార్తీక దీపం సీరియల్ వల్లే వచ్చింది. ఈ సీరియల్ లో లో విలన్ పాత్రకు గాను శోభా శెట్టిని రాష్ట్రీయ గౌరవ్ అవార్డు వరించింది. కాంగ్రెస్ సీనియర్ లీడర్ పీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి చేతుల మీదుగా శోభా శెట్టి అ వార్డు అందుకున్నారు.