వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ సరిపోదా శనివారం అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ హైదరాబాద్లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం అయ్యినట్లు ప్రకటించారు. ఈ షెడ్యూల్ లో నానితో పాటు ఇతర కీలక తారాగణం కూడా పాల్గొంటుంది.
ఈ చిత్రంలో నానికి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. DVV ఎంటర్టైన్మెంట్కి చెందిన DVV దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చారు.