కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి 'దేవర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాని నిర్మస్తున్న నందమూరి కళ్యాణ్‌రామ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న దేవర సినిమా గురించి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కంటే ఎన్టీఆర్ దేవర గొప్పదని నేను భావిస్తున్నానని దీని గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నేను పట్టించుకోను అని ఆయన అన్నారు.
కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ.... దేవర దేవర. దేవరను ఏ సినిమాతో పోల్చడం నాకు ఇష్టం లేదు. ఇది దాని స్వంత మార్గంలో ప్రత్యేకంగా ఉంటుంది. మేము ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నామో నాకు తెలుసు. సినిమాలో చాలా డిటైలింగ్ ఇమిడి ఉంది. సినిమా కోసం చాలా సెట్స్ వేసాం. ఈ విషయాల గురించి ఎన్టీఆర్ మాట్లాడితే సముచితంగా ఉంటుంది. సాబు సిరిల్ (ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్) గత ఏడాదిగా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. దేవర కథ 1900 నాటి కథ అని కళ్యాణ్‌రామ్ వెల్లడించారు. వీఎఫ్ఎక్స్ పార్ట్‌లో హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారని నిర్మాత తెలిపారు.
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, తారక్ పొన్నప్ప కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.