ఇటీవలి ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ దేవర నిర్మాతలలో ఒకరైన నందమూరి కళ్యాణ్‌రామ్ భారతీయ సినిమాలో ఇంతకు ముందెన్నడూ ప్రయత్నించని అండర్ వాటర్ సన్నివేశం ఉంటుందని చెప్పారు. కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ.... అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం మా బృందం సుమారు 8 నెలల పాటు విస్తృతమైన పరిశోధనలు చేసింది. మనలాగా ఎవ్వరూ ఇంత ప్రయత్నం చేసి ఉండరు. మా బృందం దేవర కోసం చాలా కష్టపడుతోంది అని అన్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.