సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు బాలయ్య ఆయనకు అభినందనలు తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాలపై ఇరువురు ప్రముఖ నేతలు చర్చించారు.
ఈ భేటీలో సీఎం, బాలయ్యతో పాటు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బాలయ్య అల్లుడు, ఇతర రాష్ట్రాల అధికారులు కూడా పాల్గొన్నారు. రానున్న రోజుల్లో సినీ పరిశ్రమ కార్మికుల సంక్షేమం కోసం సీఎం పలు చర్యలను ప్రకటించనున్నారు. వర్క్ ఫ్రంట్ లో చూస్తే, బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నాడు. ఆహాలో అతని టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ NBK రెండవ సీజన్ మరోసారి భారీ విజయాన్ని సాధించింది.