డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన వ్యూహం సినిమా విడుదలకు చాలా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే సినిమా షూటింగ్ను పూర్తి చేసుకుని ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తోంది..ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి జీవిత కథ అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా పైన పలు రాజకీయ పార్టీలు సైతం తీవ్ర అభ్యంతరాన్ని తెలియజేస్తున్నాయి.. తమ నాయకులను సైతం కించపరిచేలా ఉన్నాయంటు చాలామంది వర్మ వ్యూహం చిత్రాన్ని అడ్డుకోవడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యంగా టిడిపి, కాంగ్రెస్ నాయకులు సైతం కోర్టులో కేసు వేయడం జరిగింది. నవంబర్ 10వ తేదీని థియేటర్లో రావలసిన వ్యూహం సినిమా వాయిదా పడింది అయితే ఎలాగోలాగా సెన్సార్ అనుమతులు పొందిన వర్మ డిసెంబర్ 29న తన సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో మరొకసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన టిడిపి నాయకుడు లోకేష్ శుక్రవారం ను పిటిషన్ విచారించాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. దీంతో కొన్ని ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ను నిలుపుదల చేస్తూ ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది.
జనవరి 11 వరకు ఈ సినిమాని విడుదల చేయవద్దంటూ ఆదేశాలను జారీ చేసింది. ఆ తర్వాత విచారణ జనవరి 11 కు వాయిదా వేసేలా ఉన్నది.. వర్మ వ్యూహం సినిమాల పైన పిటిషన్ పైన విచారించిన తర్వాత కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది ఈ సినిమాని థియేటర్లో ఓటీటిలోను యూట్యూబ్లో ఎక్కడా కూడా విడుదల చేయవద్దు అంటు స్టేను తీసుకురావడం జరిగింది. మరి ఈ విషయం పైన వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి సీఎం జగన్ పాత్రను ప్రముఖ నటుడు సమీర్ అజ్మల్ పోషించారు. వైఎస్ భారతి గా నటి మానస నటించిన ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్ బ్యానర్ పైన దాసరి కిరణ్ నిర్మించారు.