హీరో శివాజీ గురించి అందరికీ తెలిసిందే. ఇటీవల బిగ్బాస్ షోలో కంటెస్టెంట్గా ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన రెండో భార్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రెండో భార్య లేకుండా తాను ఉండలేనని చెప్పారు. అయితే రెండో భార్య అంటే.. మనిషి అనుకుంటే పొరపాటే.. ఆయనకు ఎంతో ఇష్టమైన కాఫీనే తనకు రెండో భార్య అని వెల్లడించారు. కాఫీ లేకపోతే బతకలేనని నవ్వుకుంటూ చెప్పుకొచ్చారు.