దేశంలో సినిమాలకు మరింత క్రేజ్ పెరుగుతోంది. 2022తో పోలిస్తే 2023లో బాక్సాఫీస్ కలెక్షన్లలో 8 శాతం వృద్ధి కనిపిస్తోంది. అత్యధికంగా కన్నడలో 70 శాతం పెరుగుదల నమోదవగా, బాలీవుడ్లో 45 శాతం కలెక్షన్లు పెరిగాయి. అయితే టాలీవుడ్ మాత్రం కాస్త నిరాశ పరిచింది. టాలీవుడ్లో 3 శాతం తగ్గింది. అలాగే మలయాళం 15 శాతం, తమిళ్ కూడా 3 శాతం, ఇతర అన్ని భాషలు 10 శాతానికి పడిపోయాయి. కాగా 2024లో హిందీ బాక్సాఫీసు పడిపోతుందని, తెలుగు పెరిగే అవకాశమున్నట్లు కనిపిస్తోంది.