తెలుగు లో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇప్పుడు హిందీలో రీమేక్ గా చేయడం ట్రెండ్ గా మారింది. తాజాగా తెలుగులో బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయిన మల్టీ స్టారర్ చిత్రం ఎఫ్ 2 నుప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోనీ కపూర్ తో కలిసి హిందీలో నిర్మించనున్నాడు.
అనీష్ బాజ్మీ ఈ రీమేక్ ను డైరెక్ట్ చేయనున్నాడు. త్వరలోనే ఈ చిత్రంలో నటించే నటీనటులు గురించి క్లారిటీ రానుంది. ఇక పెళ్లికి ముందు.. పెళ్ళికి తరువాత అనే కాన్సెప్ట్ తో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈచిత్రం 80 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈచిత్రంలో విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా తమన్నా , మెహ్రీన్ లు కథానాయికలుగా నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa