కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో టాలీవుడ్ మాకో స్టార్ గోపీచంద్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'భీమా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా టీజర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఈ సినిమా టీజర్ కథాంశం గురించి గోప్యంగా ఉంచగా ఇది ఒక గ్రామ దేవాలయం చుట్టూ తిరిగే కథను సూచిస్తుంది.
ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో గోపీచంద్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో యువ తమిళ నటి ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ఈ మాస్ ఎంటర్టైనర్ను నిర్మించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.