లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్ నటించిన యాక్షన్ డ్రామా 'లియో' బాక్స్ఆఫీస్ వద్ద అద్భుతమైన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. లియోకు మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ 2023లో టాప్ ఇండియన్ గ్రాసర్స్‌లో ఈ సినిమా ఇప్పటికీ చోటు దక్కించుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం యొక్క తెలుగు డబ్బింగ్ వెర్షన్ జెమినీ టీవీలో జనవరి 15, 2024న సాయంత్రం 06:00 PMకి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రదర్శించటానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
విజయ్ సరసన ఈ సినిమాలో త్రిష జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రియా ఆనంద్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ మరియు డ్యాన్స్ మాస్టర్ శాండీ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో భారీ స్థాయిలో నిర్మించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa