ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కినేని యువ హీరో సినిమాకు రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 01, 2019, 11:53 AM

అక్కినేని యువ హీరో 'అఖిల్' అరంగేట్రం నుండి చేసిన సినిమాలు ఏవి కూడా అభిమానుల్ని అలరించలేకపోయాయి. చివరగా వచ్చిన 'మిస్టర్ మజ్ను' కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక తన నుండి రాబోతున్న 4 వ చిత్రంకు 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాతో అఖిల్ తప్పకుండా హిట్ కొట్టాలనే ఆశాభావంతో ఉన్నాడు. గత సినిమాల్లోని లోపాలను సవరించుకుంటూ అఖిల్ వెళుతున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. యూత్ కి .. మాస్ ఆడియన్స్ కు ఏ తరహా బీట్స్ ఇష్టమో దేవిశ్రీకి బాగా తెలుసు. అందువలన కథాపరంగా ఈ ప్రాజెక్టుకు ఆయననే తీసుకోవాలనే ఉద్దేశంతో గీతా ఆర్ట్స్ వారు ఉన్నారట. సంప్రదింపులు జరుగుతున్నాయని .. దాదాపు దేవిశ్రీ ప్రసాద్ ఖాయమైపోయినట్టేనని అంటున్నారు. ఇక అఖిల్ సక్సెస్ లో దేవిశ్రీ ఏ స్థాయి పాత్రను పోషిస్తాడో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa