ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మజిలీ' సినిమా ట్రైలర్ దూసుకెళ్తుంది...

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 01, 2019, 12:07 PM
వివాహం అయిన తర్వాత నాగ చైతన్య-సమంత జంటగా కలిసి చేస్తున్న చిత్రం 'మజిలీ'. నిన్న సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు నాగార్జున, వెంకటేష్ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. 

ఈ వేడుక సందర్బంగా నిన్న ఈ సినిమానుండి ఒక ట్రైలర్ ను విడుదల చేసారు.  లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్ యూత్ ను ఆకట్టుకునేలా వుంది.చాలా తక్కువ సమయంలో ఈ ట్రైలర్ కి 2 మిలియన్ డిజిటల్ వ్యూస్ రావడం విశేషం. చైతూ .. సమంత పెళ్లి తరువాత చేసిన తొలి సినిమా కావడం వలన, ఈ సినిమా పట్ల భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా పట్ల ఏ స్థాయిలో ఆసక్తి వుందనడానికి ఉదాహరణంగా ఈ వ్యూస్ కనిపిస్తున్నాయి. ఈ ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ వలన సినిమా విజయం పట్ల టీమ్ కి  మరింత నమ్మకం పెరిగింది.ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa