టాలీవుడ్‌లో ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కానుంది. టాలీవుడ్ కొత్త బ్యానర్ శ్రీ గణపతి సినిమాస్ తొలి నిర్మాణ సంస్థ ముహూర్త వేడుకకు 24 మంది ప్రముఖ తెలుగు దర్శకులు హాజరుకానున్నారు. ఈ చిరస్మరణీయ వేడుకకు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రముఖ దర్శకులు క్రిష్, వేణు శ్రీరామ్, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ, రాహుల్ సంకృత్యాన్, సాగర్ చంద్ర, వెంకీ కుడుముల, త్రినాధరావు నక్కిన, శైలేష్ కొలను, వేణు ఊడుగుల వంటి ప్రముఖ దర్శకులు మరికొందరు ప్రతిభావంతులైన యువ దర్శకులు ఈ సినిమా పూజా కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి రచయిత మోహన్ దర్శకత్వం వహిస్తుండగా వెన్నపూస రమణా రెడ్డి ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.