టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ OTTలో ఉస్తాద్ అనే గేమ్ షోతో ప్రేక్షకులని అలరించడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ గేమ్ షోకి ఇప్పటివరకు నాని, సిద్ధూ జొన్నలగడ్డ, రానా, విశ్వేక్ సేన్ గెస్ట్స్ గా వచ్చారు. షో మేకర్స్ ఈ గేమ్ షోలో తదుపరి సెలబ్రిటీ గెస్ట్ గా వస్తుంది హనుమాన్ హీరో తేజ సజ్జ అని పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ గేమ్ షో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ETV విన్ లో ప్రసారం కానుంది.