ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా 2019లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ ని విడుదల చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, యాత్ర2 టీజర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ వన్ పోసిషన్ లో ఉంది.
ఈ సినిమా ఫిబ్రవరి 8, 2024న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దివంగత రాజకీయ నాయకుడు వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ పాత్రలో స్టార్ హీరో జీవా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నారా చంద్రబాబు నాయుడుగా మహేష్ మంజ్రేకర్, సోనియాగాంధీగా సుజానే బెర్నార్డ్, వైఎస్ భారతిగా కేతకి నారాయణన్ నటిస్తున్నారు. నిర్మాణ సంస్థలు V సెల్యులాయిడ్ మరియు త్రీ ఆటం లీవ్స్ ఈ గ్రిప్పింగ్ పొలిటికల్ థ్రిల్లర్ ని నిర్మిస్తున్నాయి. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.