స్టార్ హీరోయిన్ సమంత తన బాల్యం గురించి షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఇటీవల ఇన్స్టా వేదికగా మాట్లాడిన సామ్ సినిమాల్లోకి రాకముందు తన జీవితం గురించి తెలిపింది. తన కష్టాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయింది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తాను చాలా కష్టాలను చూశానని, ఆ టైంలో ఏ పని దొరికితే ఆ పని చేశానంటూ చెప్పుకువచ్చింది. అలా ఓ స్టార్ హోటల్లో పని చేశానని, హోటల్లో వ్యాఖ్యాతగా చేస్తే అప్పుడు తనకు నెలకు రూ.500 ఇచ్చారని తెలిపింది.