నటి నయనతార ఓ కార్యక్రమంలో తన భర్త విఘ్నేశ్ శివన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని మనం విన్నాం. కానీ, విజయవంతమైన, సంతోషంగా ఉన్న స్త్రీ వెనుక పురుషుడు కచ్చితంగా ఉంటాడు. నేనే దీనికి ఉదాహరణ. విఘ్నేశ్ నా నిర్ణయాలను ఎప్పుడూ ప్రశ్నించలేదు. ఎన్నో పనుల్లో నాకు ధైర్యాన్నిస్తూ నడిపిస్తున్నాడు’’ అని తెలిపారు.