బాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణించి ఆతర్వాత విలన్ గా లు చేస్తున్నారు సంజయ్ దత్. సంజయ్ దత్ జీవితం చాలా వివాదాలతో ముడిపడి ఉంటుంది. ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నారు సంజయ్ దత్ అలాగే ముగ్గురిని పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచాడు ఈ స్టార్ నటుడు.అయితే సంజయ్ దత్ పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలుసు.. కానీ ఆయన ఫ్యామిలీ డీటైల్స్ చాలా మందికి తెలియకపోవచ్చు. 1987లో నటి రిచా శర్మను వివాహ చేసుకున్నారు సంజయ్. 1996లో రిచా బ్రెయిన్ ట్యూమర్ తో మరణించారు. వీరికి ఒక కూతురు త్రిషాలా ఉన్నారు. రిచా మరణం తరువాత సంజయ్ కు ఆయన కూతురు దూరంగా ఉంటుంది. ఆమె తన అమ్మమ్మ, తాతయ్యలతో అమెరికాలో ఉంటున్నారు. 1998లో మోడల్ రియా పిళ్ళైను రెండో వివాహం చేసుకున్నారు సంజయ్.
2005లో వారు విడాకులు తీసుకున్నారు. రెండేళ్ళ డేటింగ్ తరువాత 2008లో మాన్యతా దత్ ను గోవాలో మూడో పెళ్ళి చేసుకున్నారు ఆయన. 21 అక్టోబరు 2010న వారికి కవల పిల్లలు పుట్టారు. అబ్బాయి షహ్రాన్, అమ్మాయి ఇక్రా. ఇదిలా ఉంటే సంజయ్ దత్ మొదటి భార్య కూతురు త్రిషల హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
త్రిషాల అమెరికాలో సైకియాట్రిస్ట్‌గా పనిచేస్తున్నారు. త్రిషల వయసు ఎనిమిదేళ్ల వయసులో ఆమె తల్లి మరణించింది. ఆ తర్వాత ఆమె ల వైపు మగ్గు చూపలేదు. సైకాలజీ చదివి సైకియాట్రిస్ట్ అయ్యింది. ఇప్పుడు అమెరికాలో స్థిరపడింది. త్రిషాల ప్రియుడు 2019లో చనిపోయాడు. దీంతో త్రిషాల మానసిక ఆరోగ్యం దెబ్బతింది. ఉద్యోగం మానేసింది. తాజాగా త్రిషల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. నాకు బిడ్డ కావాలి. దేవుడు నా కోసం ఏదైనా ప్లాన్ వేశాడేమో చూడాలి. నేను ఏదో ఒక రోజు తల్లి అవుతాను. నాకు కాబోయే పిల్లల పేర్లను కూడా నిర్ణయించుకున్నాను' అని తెలిపింది. త్రిషాలకు ఇంకా పెళ్లి కాలేదు. సరైన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటా' చెప్పుకొచ్చింది త్రిషల.