ఏప్రిల్ 4న అమెరికాలో మజిలీ చిత్ర ప్రీమియర్ షోలు నిర్వహించబోతున్నారు. కాగా సినిమా ప్రీమియర్‌ను ఉద్దేశించి నటుడు నాగ చైతన్య మాట్లాడాడు. తన సినీ కెరీర్‌లోనే ఎక్కువ స్క్రీన్లపై ప్రీమియర్ షోలు ప్రదర్శించబోతున్న సినిమా ఇదని చెప్పాడు. ‘మూన్ షైన్ సినిమాస్ ‘మజిలీ’ని అమెరికాలో విడుదల చేయబోతోంది. ఏప్రిల్ 4న ఉదయం ఆరు గంటలకు అమెరికాలో మొదటి షో ప్రారంభం కాబోతోంది. నా కెరీర్‌లోనే అతి ఎక్కువ స్క్రీన్లపై (ప్రీమియర్) ప్రదర్శించబడుతోన్న సినిమా ఇది. మూన్ షైన్ సినిమాస్‌కు ధన్యవాదాలు. పైరసీని ప్రోత్సహించొద్దు. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని కచ్చితంగా చెబుతున్నా. మేం ఎంత ఇష్టంగా సినిమాను చేశామో.. అలా మీరూ దాన్ని ఇష్టపడుతారని పేర్కొన్నాడు. ‘మజిలీ’లో సమంత, దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్స్. ‘నిన్నుకోరి’ ఫేం శివ నిర్వాణ దర్శకుడు. షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మించింది. గోపీ సుందర్ బాణీలు అందించారు.