స్టార్ హీరోయిన్ తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథిస్ బోతో ప్రేమలో పడింది. గతంలో వీరి ప్రేమాయణంపై రూమర్స్ వినిపించినా తాప్సీ ఎప్పుడూ పెదవి విప్పలేదు. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది. ‘దక్షిణాది నుంచి బాలీవుడ్లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే మాథిస్తో పరిచయమైంది. ఇన్నేళ్ల మా బంధం మరింత బలపడుతూ వచ్చింది. మా ప్రేమ వ్యవహారం గురించి ఎక్కడా మాట్లాడలేదు. మాథిస్తో సంతోషంగా ఉన్నా.’ అని తాప్సీ అన్నారు.