సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా 'సాహో' సినిమా రూపొందుతోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు పనిచేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ బైక్ రైడింగ్ కి సంబంధించిన సన్నివేశాలను కొంతకాలం క్రితం షూట్ చేశారు. ఆ బైక్ కి సంబంధించిన ఫోటో ఒకటి బయటికి రావడంతో, దాని గురించి తెలుసుకోవడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రయత్నించారు.
ఈ సినిమా కోసం ప్రభాస్ 'ట్రిమ్ప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ఎస్' అనే బైక్ ను ఉపయోగించాడు. 765 సీసీ లైన్ త్రీ సిలిండర్ ఇంజన్ ద్వారా ఈ బైక్ కి పవర్ సప్లై అవుతుందట. ఈ బైక్ టాప్ లైన్ మోడల్ ధర (ఎక్స్ షోరూమ్ ధర) 10.55 లక్షలు అని తెలుస్తోంది. ఈ మోడల్ బైక్ ను ఇంతకుముందు బాలీవుడ్లోనే కాదు, 'మిషిన్ ఇంపాసిబుల్'తో పాటు పలు హాలీవుడ్ సినిమాల్లోనూ ఉపయోగించారట. ఈ బైక్ పై మనసు పారేసుకున్న ప్రభాస్, దానిని తన సొంతానికి వాడుకునేందుకు ఇంటికి తీసుకెళ్లాడని చెప్పుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa