ఇటీవలే కెప్టెన్ మిల్లర్‌లో కనిపించి ప్రశంసలు పొందిన కోలీవుడ్ నటుడు ధనుష్ ఒక స్ట్రెయిట్ తెలుగు చిత్రం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి తాత్కాలికంగా D 51 అనే పేరును పెట్టారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం అధికారికంగా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించింది. ఈ పూజా కార్యక్రమంలో చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ములతోపాటు ధనుష్, సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, భరత్ నారంగ్, ఝాన్వీ నారంగ్ మరియు ఇతర ముఖ్య వ్యక్తులు పాల్గొన్నారు. ప్రధాన నటీనటులు పాల్గొనే కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతోంది.
ఈ ప్రాజెక్ట్‌లో రష్మిక మందన్న మహిళా ప్రధాన పాత్రను పోషించనుంది. అక్కినేని నాగార్జున ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నికేత్ బొమ్మి ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సహకారంతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యొక్క యూనిట్), సోనాలి నారంగ్ సమర్పణలో ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు.