నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ 'సరిపోదా శనివారం' చిత్రాన్ని తెరకెక్కిస్తోన్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్తో స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను ఎస్వీసీ సంస్థ అధినేత దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఇక ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా.. వెర్సటైల్ స్టార్ ఎస్జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు.
విభిన్నమైన కాన్సెప్టుతో రూపొందుతోన్న 'సరిపోదా శనివారం' మూవీ నుంచి ఇటీవలే గ్లింప్స్ వీడియో విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా వచ్చింది. ఫలితంగా ఈ చిత్రంపై ఉన్న అంచనాలు రెట్టింపు అయిపోయాయి. ఇదే అదునుగా చిత్ర యూనిట్ బిజినెస్ కార్యక్రమాలను మొదలు పెట్టినట్లు తెలిసింది. దీనిపై తాజాగా ఓ ప్రకటనను కూడా వదిలింది.