జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన 'నెరు' సినిమా డిసెంబర్ 21న విడుదల అయ్యింది. ఈ కోర్టు రూమ్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. జనవరి 23, 2024న OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి మలయాళ వెర్షన్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ మరియు కన్నడ భాషలలో అందుబాటులో ఉంటుంది అని సమాచారం.
ఈ సినిమాలో మోహన్ లాల్ క్రిమినల్ లాయర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆంటోని పెరుంబావూర్ మరియు ప్రియామణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నెరు చిత్రాన్ని మోహన్‌లాల్ స్వంత బ్యానర్ ఆశీర్వాద్ సినిమాస్ నిర్మిస్తుంది.