మాలీవుడ్ స్టార్ హీరో మోహన్‌లాల్ లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించిన పాన్-ఇండియన్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'మలైకోట్టై వాలిబన్' అనే కొత్త చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 25, 2024న తెలుగుతో సహా పలు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ విడుదల కానుంది.
ఈ సినిమాని జర్మనీలో లోకా ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తుంది. తాజాగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా కొన్ని గంటల్లో 1000 టిక్కెట్లు అమ్ముడయినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో రాధికా ఆప్టే, విద్యుత్ జమ్వాల్, సోనాలీ కులకర్ణి మరియు డానిష్ సైత్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. జాన్ మరియు మేరీ క్రియేటివ్ మాక్స్ ల్యాబ్స్ మరియు సెంచరీ ఫిల్మ్స్‌తో కలిసి ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాని నిర్మిస్తున్నారు.