వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'సరిపోదా శనివారం' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ 45 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో నానికి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. ఈ చిత్రం SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. DVV ఎంటర్టైన్మెంట్కి చెందిన DVV దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చారు.