ఆర్.రవి కుమార్ దర్శకత్వంలో కోలీవడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన 'అయాలాన్' చిత్రం జనవరి 12, 2024న థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా యొక్క తమిళ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సన్ NXT సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా తమిళ వెర్షన్ త్వరలో OTT ప్లాట్‌ఫారమ్ సన్ NXTలో విడుదల కానుంది అని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.
ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ మహిళా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్, భాను ప్రియ మరియు యోగి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 24 AM స్టూడియోస్ మరియు ఫాంటమ్‌ఎఫ్‌ఎక్స్ స్టూడియోస్ బ్యానర్‌లపై కోటపాడి జె రాజేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి లెజెండరీ ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు.