టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు షూటింగ్ పనులలో ఏ మాత్రం విరామం దొరికిన తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్తూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే.ఇలా వెకేషన్ కి వెళ్తూ ఉండే ఈయన ఈసారి మాత్రం తన ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా జర్మనీ వెళ్లారు. మహేష్ బాబు ఇలా ఒంటరిగా వెళ్ళేది చాలా అరుదుగా ఉంటుంది షూటింగ్ అయినా షూటింగ్ లేకపోయిన ఫ్యామిలీతో కలిసి ఈయన వెకేషన్ వెళ్తూ ఉంటారు. ఈ విధంగా మహేష్ బాబు ఒంటరిగా జర్మనీ వెళ్లడంతో ఈయన వెకేషన్ గురించి పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.ఇన్ని రోజులు మహేష్ బాబును వదిలి నమ్రత ఎప్పుడు ఉండలేదని తెలుస్తుంది. ఎక్కడికి వెళ్లినా ఫ్యామిలీతో సహా వెళ్లే మహేష్ బాబు ఈసారి ఒంటరిగా ఉండడంతో మహేష్ బాబుని నమ్రత చాలా మిస్ అవుతున్నారని తాజాగా ఈమె చేసిన పోస్ట్ చూస్తేనే అర్థమవుతుంది. మహేష్ బాబు షేర్ చేసిన ఫోటోలపై నమ్రత స్పందిస్తూ మిస్ యు అంటూ లవ్ సింబల్ తో ఎమోషనల్ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నమ్రత పుట్టినరోజుకి కూడా మహేష్ బాబు దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. మరి ఈయన జర్మనీ వెళ్లడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మాత్రం తెలియడం లేదు.