టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'డబుల్ ఇస్మార్ట్' అనే టైటిల్ ని లాక్ చేసి అధికారికంగా లాంచ్ చేసారు. తాజాగా ఇప్పుడు ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా క్లైమాక్స్ షూటింగ్ ముంబైలో జరుగుతున్నట్లు సమాచారం. పూరి జగన్ మొత్తం క్లైమాక్స్‌కే 7 కోట్లు ఖర్చు పెట్టినట్లు లేటెస్ట్ టాక్.
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌పై, విషు రెడ్డి CEOగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.