టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇంట సందడి వాతావరణం నెలకొంది. నిఖిల్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ మేరకు తాజాగా భార్య పల్లవి సీమంతం ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'మా మొదటి బిడ్డ అతి త్వరలోనే రానుంది. పల్లవి, నేను చాలా సంతోషంగా ఉన్నాం. దయచేసి మీ దీవెనలు పంపండి' అని ట్విట్టర్ వేదికగా కోరాడు. దీంతో నిఖిల్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.