ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లైట్ గ్రీన్ శారీలో వర్ష గ్లామర్ మెరుపులు

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 01, 2024, 11:30 AM

బుల్లితెర బ్యూటీ జబర్దస్త్ వర్ష  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ తన అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి టీవీ షోలతో వర్ష  బుల్లితెరపై మెరుస్తున్న విషయం తెలిసిందే. కామెడీ స్కిట్లతో నవిస్తూనే మరోవైపు గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ వస్తోంది. కామెడీ షోల్లో మాత్రం తనదైన పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను అలరిస్తోంది. బుల్లితెరపై తను కనిపించినంత సేపు ఆడియెన్స్ కు కావాల్సిన ఫన్ ను అందించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే వర్ష జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తో కలిసి కామెడీ స్కిట్లలో నటించి మెప్పించింది. మరోవైపు  వీరి లవ్ ట్రాక్ కూడా తెరపైకి రావడంతో మరింతగా పేరు సంపాదించుకుంది. ఆ క్రేజ్ తోనే వర్ష కాస్తా సంపాదనను కూడా పెంచుకుంటోంది. పలు కమర్షియల్ ఫొటోషూట్లు, ఓపెనింగ్స్ కు వెళ్తూ సందడి చేస్తోంది. తన బ్యూటీపుల్ లుక్స్ తో కట్టిపడేస్తోంది.మరోవైపు తన ఫ్యాన్స్ కోసం కూడా ఈ ముద్దుగుమ్మ క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చింది. లైట్ గ్రీన్ శారీలో గ్లామర్ మెరుపులు మెరిసింది. ఇటీవల కుర్ర భామ వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ట్రెండీ వేర్స్ తో పాటు ట్రెడిషనల్ లుక్ లో మెరుస్తూ మెస్మరైజ్ చేస్తోంది. ఎక్కువగా సంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తోంది. 


 చీరకట్టులో వర్ష మరింతగా మెరిసిపోతోంది. తన అందాన్ని రెంటింతలు పెంచుకుంది. ఆకర్షించే లుక్ తో తన అభిమానులతో మరింతగా ఆకట్టుకుంటోంది. నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. అలాగే ఈ ముద్దుగుమ్మ గ్లామర్ విందు కూడా చేస్తోంది. తన బ్యూటీఫుల్ లుక్స్ లో కట్టిపడేస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో స్కిన్ షోతోనూ మతులు చెడగొట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 


 












SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com