బెస్ట్‌విన్ ప్రొడక్షన్ బ్యానర్ పై భీమినేని సురేష్, జి.రామకృష్ణారావుసంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రుణం. ఎస్.గుండ్రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇద్దరి స్నేహితులు ఒక వ్యక్తిని నమ్మి మోసపోవడంతో వారి జీవితాల్లో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. గోపికృష్ణ, మహేంద్ర షిల్పా, ప్రియా అగస్థ్యన్లు నటీనటులుగా నటించారు. ఈ చిత్రం షూటింగ్ సెన్సార్ పనులు పూర్తి చేసుకొని ఏప్రిల్ 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఫిలింఛాంబర్‌లో ఏర్పాటు చేసిన ఆడియో సక్సెస్ మీట్ లో ..
ప్రొడ్యూసర్ జి. రామకృష్ణారావు మాట్లాడుతూ... ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదలవ్వడం చాలా ఆనందంగా ఉంది. మానవ సంబంధాలపై రాసిన కథ. ప్రతి ఇంటిలోనూ రుణానుబంధాలు ఉంటాయి. డైరెక్టర్‌గారు చాలా టైటిల్స్‌ను వెతికి మరీ ఈ కథకు అనుగుణంగా ఉండే రుణం టైటిల్‌ను ఎంచుకున్నారు. ఈ కథ ఫ్యామిలీ ఎమోషన్స్ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం. ఇద్దరి స్నేహితుల ఫ్యామిలీల మధ్య నడిచే కథ. ఈ చిత్రానికి డైలాగులు బాగా కుదిరాయి. డైరెక్టర్‌గారు ప్రతి పాత్రని చాలా చక్కగా చిత్రీకరించారు. నేను ఎన్నో సినిమాలు చూశాను కాని ప్రొడ్యూస్ చెయ్యడం మొదటిసారి. మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. డిఓపి కూడా చాలా కష్టపడ్డారు. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ వారి వారి పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించారు నాకు అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞతలు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa