ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రజినీ అభిమానులకు పండగ

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 09, 2019, 09:30 AM

సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులను సర్ప్రైజ్ చేశారు. పేట తరువాత తన తరువాతి చిత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే ఫస్ట్‌లుక్, టైటిల్‌ను విడుదల చేసి అభిమానులను థ్రిల్ చేశారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘దర్బార్’ అనే పేరును ఖరారు చేసి ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదలచేశారు. మురగదాస్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ చిత్రం యొక్క షూటింగ్ ఏప్రిల్ 10 నుండి మొదలు కానుంది. ముంబయి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫిసర్‌గా నటించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో ఆయనకు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనుంది. అనిరుద్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్నీ లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa