ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుట్టిన రోజు పార్టీలో మహేశ్, తారక్ సందడి

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 09, 2019, 10:50 AM

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమాను పూర్తి చేసుకుని, చిత్ర ప్రమోషన్ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నాడన్న సంగతి తెలిసిందే. తాజాగా వంశీ సతీమణి మాలిని పుట్టినరోజు జరుగగా, ఈ పార్టీలో తారల సందడి కనిపించింది. మహేశ్ తన భార్య నమ్రతతో కలిసి ఈ పార్టీకి హాజరు కాగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి పార్టీకి హాజరై, మాలినికి శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరు స్టార్ హీరోల రాకతో ఈ పార్టీ మరింత జోరుగా సాగింది. గతంలో ఎన్టీఆర్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో 'బృందావనం' విడుదలైన సంగతి తెలిసిందే. మాలిని పుట్టిన రోజు సందర్భంగా వీరంతా కలిసి దిగిన ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దాన్ని మీరూ చూడవచ్చు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa