ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లెహంగా వేర్ లో రకుల్ ప్రీత్ సింగ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2024, 11:42 AM

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం మళ్లీ దక్షిణాదిలోనే సందడి చేస్తోంది. రీసెంట్ గా తమిళ చిత్రం ‘ఆయలాన్’ తో ప్రేక్షకులను అలరించింది. సంక్రాంతి సినిమాల రద్దీ కారణంగా తెలుగు వెర్షన్ లో విడుదల కాలేదు. ఫిబ్రవరి 16న మాత్రం సన్ నెక్ట్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ అందుబాటులో ఉంటుంది. నెక్ట్స్ తమిళం నుంచే ‘ఇండియన్ 2’తో రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక రకుల్ తన సినిమాల గురించి వెంటవెంటనే అప్డేట్స్ కూడా అందిస్తూ వస్తోంది.సినిమా విషయాలను పంచుకోవడంతో పాటు ఢిల్లీ బ్యూటీ ఫిట్ సెన్ మోటీవేషన్ ను కూడా అందిస్తుంటుంది. అలాగే లేటెస్ట్ ఫ్యాషన్ ను కూడా పరిచయం చేస్తూ ఫొటోషూట్లు చేస్తుంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ  ఆకట్టుకుంటోంది. బ్యూటీఫుల్ డిజైన్ వేర్స్ ను చూపిస్తోంది.తాజాగా రకుల్ ప్రీత్ బ్యూటీఫుల్ లెహంగా వేర్ లో దర్శనమిచ్చింది. శివన్, నరీన్ డిజైన్ చేసిన ట్రెండీ లెహంగా, బ్లౌజ్ లో ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది. ఆ డ్రెస్ ధరించడంతో రకుల్ లుక్ మరింతగా పెరిగింది.అయితే, ఆ డ్రెస్ కాస్ట్ మాత్రం దిమ్మతిరిగిపోయేలా ఉంది.. డిజైన్లకు సంబంధించిన అఫీషియల్ సైట్ లో లెహంగాల కాస్ట్ దూల తీరిపోయేలా ఉంది. తాజాగా రకుల్ ధరించిన డ్రెస్ మాదిరి లెహంగాల ధర రూ.2 లక్షలకు పైగా ఉండటం ఆశ్చర్యకరంగా మారింది. బ్యూటీఫుల్ డిజైన్స్ తో మాత్రం కలెక్షన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. 


 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com