పెళ్లిసందడి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల మంచి గుర్తింపు తెచ్చుకుంది. తనదైన నటన, డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం తెలుగుచిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. డైరెక్టర్ సుకుమార్, అల్లుఅర్జున్ కాంబినేషన్ లో నిర్మిస్తున్న పుష్ప సీక్వెల్ లో ఐటమ్ సాంగ్ ఆఫర్ వస్తే శ్రీలీల నో చెప్పిందట. పుష్ప మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.! అలాంటి సినిమా సీక్వెల్ లో వచ్చిన ఆఫర్ ను తిరస్కరిస్తూ శ్రీలీల షాకింగ్ డెసిషన్ తీసుకుంది.