నటి పూనమ్ పాండే వివాదాస్పద ప్రచారంలో భాగమైన డిజిటల్ ఏజెన్సీ క్షమాపణలు తెలిపింది. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకే చనిపోయినట్లు పోస్ట్ పెట్టించానంటూ పూనమ్ చేసిన వివాదాస్పద ప్రచారం తీవ్రవిమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే.‘‘సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కోసం పూనమ్ చేసిన ప్రచారంలో మేం భాగమయ్యాం. దీనిపై మేం క్షమాపణలు తెలియజేయాలనుకుంటున్నాం. అవగాహన కోసమే మేం అలా వ్యవహరించాం’’అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.