ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను పెళ్లి చేసుకోవాలా?.. శ్రద్దా కపూర్ పోస్ట్ వైరల్

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 05, 2024, 01:17 PM

తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌ ఆకట్టుకుంటున్నది. ఈమె సామాజిక మాధ్యమాల్లో కూడా చురుగ్గా ఉంటుంది. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫొటోలను వరుసగా పోస్ట్‌ చేసిన ఈ ముద్దుగుమ్మ ‘నేను ఎలా ఉన్నాను.. పెళ్లి చేసుకోవాలా?’ అని అభిమానులను అడిగింది. దీంతో ఆమె ఇన్‌స్టా అకౌంట్‌ను కామెంట్ల వరద ముంచెత్తుతున్నది.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ అమ్మడు ఇటీవల తన పెళ్లి గురించి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘నేను పెళ్లి చేసుకోవాలా?’ అంటూ పోస్ట్‌ చేసింది. దీంతో సోషల్‌ మీడియాలో ఆమె అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు దర్శన్‌ రావల్‌ సైతం ఈ పోస్ట్‌ కింద కామెంట్‌ చేయడం విశేషం. ఈ ఏడాది చేతి నిండా సినిమాలతో ప్రేక్షకులను అలరించనుంది శ్రద్దా.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com