బాలీవుడ్ కపుల్ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాలకు తీసుకుంటున్నారనే వార్తలకు తాజాగా ఐశ్వర్య చెక్ పెట్టారు. నేడు అభిషేక్ బర్త్ డే సందర్భంగా భర్త, కూతురితో కలిసి దిగిన ఫొటోను ఐష్ ఇన్స్టాలో పోస్టు చేశారు. 'మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆనందం, ప్రేమ, శాంతి, ఆరోగ్యంతో ఉండాలని దేవుడిని కోరుకుంటున్నా' అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో విడాకుల వార్తలకు ఐష్ చెక్ పెట్టిందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ ఐశ్వర్యరాయ్ హీరో అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. వీళ్ళకి సంబంధించిన ఈ వార్త ఎంతగా ట్రెండ్ అయిందో మనం చూసాం . అయితే వీళ్ళు విడాకులు తీసుకుంటున్నారు అనే వార్తలు వచ్చిన సరే ఎక్కడ కూడా ఈ జంట రియాక్ట్ అవ్వలేదు. కొన్ని సందర్భాలలో అభిషేక్ బచ్చన్ ఒక్కడే బాలీవుడ్ పార్టీస్ లో , పుణ్యక్షేత్రాలలో కనిపించడం ఈ విడాకుల రూమర్స్ కు ఇంకా ఎక్కువగా ఆజ్యం పోసినట్లయింది.