ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం రేవంత్ ని కలిసిన దిల్ రాజు

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 08, 2024, 11:55 AM

తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు తన కుటుంబంతో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిశారు. దిల్ రాజు, అతని సోదరుడు శిరీష్, కుమార్తె, అల్లుడు, దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్ ఈరోజు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వున్నారు. అయితే ఇదేదో దిల్ రాజు పరిశ్రమ తరపున వెళ్లి కలిసింది కాదు, అతను వ్యక్తిగతంగా తన ఇంట్లో పెళ్లి వేడుకలకు ఆహ్వానించడానికి కలిశారు. దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్ వివాహం త్వరలో జరగబోతోంది, అందుకే ఇటు పరిశ్రమలోని, అటు రాజకీయ, వ్యాపార రంగంలో వున్నవారిని దిల్ రాజు కుటుంబంతో సహా వెళ్లి వ్యక్తిగతంగా అందరికీ శుభలేఖలు ఇచ్చి పెళ్ళికి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రిని కలిసి ఆశిష్ వివాహానికి ఆహ్వానించారని తెలిసింది. కొన్ని రోజుల క్రిత్రం తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ని కూడా కలిసి శుభలేఖ అందచేశారు. అంతకు ముందు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ని కూడా కలిసి అహ్వాన పత్రిక అందచేశారు. ఇక పరిశ్రమలో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరినీ వ్యక్తిగతంగా వెళ్లి కలిసి పెళ్ళికి పిలిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com