ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలకు ప్రచారకర్తగా పూనమ్‌ను నియమించనుందన్న వార్తలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఖండించింది.
సర్వైకల్ కేన్సర్‌పై అవగాహనకుగాను ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా పరిగణించే అవకాశం లేదని స్పష్టం చేసింది.ఇప్పటికే కేంద్రంతో పూనమ్ పాండే, ఆమె టీం చర్చలు జరుపుతోందన్న వార్తల నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు స్పష్టతనిచ్చింది.