తన కథను విని కొన్నేళ్ల తర్వాత సినిమా తీసి కాపీరైట్ చట్టాన్ని బేబీ సినిమా దర్శకుడు, నిర్మాతలు ఉల్లంఘించారని వారిపై చర్యలు తీసుకోవాలని లఘుచిత్రాల దర్శకుడు శిరిన్ శ్రీరామ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ’’2013లో ‘కన్నా ప్లీజ్’ టైటిల్‌తో రాసుకున్న కథకు తరువాత ‘ప్రేమించొద్దు’ అని టైటిల్ పెట్టారు. ఈ కథ, బేబీ సినిమా కథ ఒక్కటే‘‘ అని శిరిన్ శ్రీరామ్ తెలిపారు. ఆయన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
2013లో తన సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయాలని డైరెక్టర్ సాయిరాజేశ్ కోరినట్లు శ్రీరామ్ తెలిపాడు. అలా ఆయనతో పరిచయం ఏర్పడిందన్నాడు. ఈ క్రమంలో బేబి సినిమా కథను తాను సాయి రాజేశ్‌కు చెప్పానని తెలిపాడు. కన్నా ప్లీజ్ అనే టైటిల్ తో తాను ఈ కథను రాసుకున్నట్లుగా వెల్లడించాడు. ఇదే కథను కొన్నేళ్ల తర్వాత అంటే 'బేబీ' టైటిల్‌తో సినిమా తెరకెక్కించారని ఆరోపించాడు. వారు కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.