తెలుగు సినిమాతో ఆరంగేట్రం చేసి, అటు హిందీ సినిమాలలో కూడా తన ప్రతిభని కనపరచి, బెంగాల్ సినిమాలో కూడా నటించి, ఇప్పుడు ఇటు దక్షిణాదిలోనూ, అటు హిందీలోనూ బిజీగా వున్న నటీమణి శ్రద్ధ దాస్ కి సామజిక మాధ్యమాల్లో కూడా బాగా ఫాలోవర్స్ వున్నారు. అటు హిందీలోనూ, ఇటు దక్షిణాదిలోనూ బిజీగా వున్న నటీమణుల్లో శ్రద్ధ దాస్ ఒకరు. 2008లో 'సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం' అనే తెలుగుసినిమాతో వెండితెరపైకి ఆరంగేట్రం చేసిన శ్రద్ధ దాస్ ఇప్పటివరకు సుమారు 40 సినిమాలకిపైగా వివిధ భాషల్లో చేసింది. అందులో ఎక్కువగా దక్షిణాదికి చెందినవే. సినిమాలతో పాటుగా శ్రద్ధ కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసిన శ్రద్ధ దాస్ ఎప్పుడూ సామజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ తన అభిమానులకి అప్పుడప్పుడు స్పెషల్ ఫోటోషూట్ చేస్తూ కనువిందు చేస్తూ ఉంటుంది. ముంబైలో పుట్టి, అక్కడే పెరిగిన శ్రద్ధ దాస్ తల్లిదండ్రులు బెంగాల్ కి చెందిన వారు. అందుకే చిన్నప్పుడు ఎక్కువగా బెంగాల్ వెళుతూ ఉండేదానిని అని చెపుతూ ఉంటుంది శ్రద్ధ దాస్. దక్షిణాది భాషలతో పాటు, హిందీలో కూడా పని చేసిన శ్రద్ధ దాస్ బెంగాలీ సినిమాలలో కూడా నటించింది. తెలుగులో ఎక్కువ సినిమాలు చేసిన శ్రద్ధ దాస్ ఒక తెలుగు రియాలిటీ షో డాన్సు ప్రాతిపదికగా వున్న షోలో జడ్జి గా కూడా చేసింది. ఇప్పుడు చేతిలో కొన్ని తెలుగు, కన్నడ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ బిజీ గా వుంది శ్రద్ధ దాస్. తెలుగులో శ్రద్ధ దాస్ కి మంచి పేరు తెచ్చిన చిత్రాలు 'ఆర్య 2', 'గుంటూరు టాకీస్', 'మరో చరిత్ర', 'పి ఎస్ వి గరుడవేగ', 'మొగుడు' ఇలా చాలా సినిమాలు వున్నాయి. తాజాగా తన ఫోటోలు కొన్ని తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అభిమానులకి కనువిందు చేసింది శ్రద్ధ దాస్.