హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంటగా నటించిన బాలీవుడ్ సినిమా ‘ఫైటర్’లో ముద్దు సీన్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఓ ఎయిర్‌ఫోర్స్ అధికారి.. చిత్ర బృందానికి లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. యూనిఫాం ధరించి ముద్దు సీన్స్ చేయడమంటే.. ఆ వత్తిని అవమానించినట్లేనని అస్సాంకు చెందిన వాయుసేన అధికారి సౌమ్య దీప్‌దాస్ ఆరోపించారు. దీనిపై చిత్ర దర్శకుడు సిద్థార్థ్ ఆనంద్ తాజాగా స్పందించారు. సినిమా సెన్సార్ పూర్తయ్యాక అధికారులను చూపించామని అన్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘ఎయిర్‌ఫోర్స్‌పై నాకు గౌరవముంది. నిబంధనల మేరకే సినిమా తీశాం. స్క్రిప్ట్ రాసుకున్నప్పటి నుంచి సెన్సార్ రిపోర్ట్ వరకు ప్రతి విషయాన్ని వాయుసేన అధికారులతో చర్చించాం.సెన్సార్ పూర్తయ్యాక థియేటర్‌లో విడుదలకు ముందు ఎయిర్ ఫోర్స్ చీఫ్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 100 మంది అధికారులకు సినిమాను చూపించాం. వారి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఫిజికల్ కాపీ తెచ్చుకున్నాం. అసలు ఫిర్యాదు చేసిన వ్యక్తి పేరుతో ఐఏఎఫ్‌లో ఏ అధికారి లేరని మా దృష్టికి వచ్చింది. ఇలా ఎవరు చేస్తున్నారో అర్థం కావడం లేదు’’ అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరలవుతున్నాయి. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ సినిమాను వీక్షించిన పలువురు సినీ, క్రీడా ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఇప్పటివరకు ఈ సినిమా రూ.350 కోట్లు పైగా వసూళ్లు చేసినట్లు చిత్రబృందం పేర్కొంది.