ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఊరు పేరు భైరవకోన' లోని హరోమ్‌హర లిరికల్ సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 11, 2024, 12:19 PM

వీఐ ఆనంద్ దర్శకత్వంలో యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సందీప్ కిషన్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ మిస్టరీ థ్రిల్లర్ కి 'ఊరి పేరు భైరవకోన' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు ఈ ఫాంటసీ డ్రామాలోని హరోమ్‌హర పూర్తి లిరికల్ సాంగ్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీ ఫిబ్రవరి 16, 2024న విడుదల కానుంది. కావ్య థాపర్, హర్ష చెముడు, రాజశేఖర్ అనింగి, వెన్నెల కిషోర్,రవిశంకర్‌ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రతిష్టాత్మకంగా సమర్పణలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa