బాలీవుడ్ ప్రముఖ గాయని, నటి విజయ్ లక్ష్మి అకా మలికా రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె ఇంట్లోని గదిలో ఉరివేసుకుని కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన అనంతరం స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం, కోత్వాలి నగర్‌లోని సీతాకుండ్ ప్రాంతంలో ఉన్న ఇంటి లోపల గదిలో ఫ్యాన్‌కు గాయని ఉరివేసుకుని మృతి చెందింది. రాత్రి ఎప్పటిలాగే ఆమె తన గదిలోకి వెళ్లిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఉదయం ఆమె తలుపులు తీయలేదని, తలుపులు బద్దలుగొట్టగా మల్లికా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిందని చెప్పారు.